For Money

Business News

నష్టాల నుంచి లాభాల్లోకి…

ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్ల ప్రారంభంలోనూ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే క్రమంగా సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. టెస్లా నేతృత్వంలో టెక్‌ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. నాస్‌డాక్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.62 శాతం లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్‌ ఒక్కటే నామమాత్రంగా 0.10 శాతం లాభంతో ఉంది. ఇవాళ 10 ఏళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ 2 శాతంపైగా క్షీణించాయి. డాలర్‌ ఇండెక్స్‌ మాత్రం 107 వద్ద నిలకడగా ఉంది. ఇక క్రూడ్‌ ధరలు మూడుశాతంపైగా క్షీణించాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 104 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక బులియన్‌ మార్కెట్‌లో బంగారం మళ్ళీ 1700 మార్కెట్‌ను దాటి1709 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.