For Money

Business News

ఇన్వెస్టర్లకు చుక్కల చూపుతున్న ఐటీ షేర్లు

కరోనా సమయంలో జెట్‌ స్పీడుతో దూసుకెళ్ళిన ఐటీ షేర్లు ఇపుడు అంతే స్పీడుతో వెనక్కి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఒక మోస్తరు నష్టాలతో లాగిస్తున్న ఐటీ షేర్లు ఇవాళ కుప్పకూలాయి. బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, డాలర్‌ కూడా బలపడటంతో ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. వాల్‌స్ట్రీట్‌లో ప్రస్తుతం నాస్‌డాక్‌ ఏకంగా 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్‌అండ్‌ పీ 500 సూచీ కూడా 1.80 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక డౌజోన్స్‌ కూడా నష్టాలు కూడా ఎక్కువే. ప్రస్తుతం 1.28 శాతం నష్టంతో ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ 0.34 శాతం బలపడింది. ఇంత బలపడినా.. క్రూడ్‌ మాత్రం ఇవాళ దాదాపు 80డాలర్ల దాకా వెళ్ళింది. 79.94 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 78 డాలర్ల వద్ద ఉంది. బులియన్‌లో పెద్ద మార్పు లేకున్నా… వెండి ఒకశాతం నష్టంతో ఉంది. ఔన్స్‌ ధర 1750 డాలర్లకన్నా తక్కువకు వచ్చినందున… బులియన్‌ చాలా బలహీనంగా ఉంది.