For Money

Business News

భారీ నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

వచ్చే నెల జరిగిన భేటీలో వడ్డీ రేట్లను మళ్ళీ 0.75 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో ట్రేడింగ్‌ రోజు నాస్‌డాక్‌ 2శాతం పైగా నష్టపోయింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.76 శాతం క్షీణించగా.. డౌజోన్స్‌ కూడా 1.57 శాతం పడిపోవడం విశేషం. అంతకుముందు యూరో మార్కెట్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం పడ్డాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.93 శాతం క్షీణించింది. అమెరికా పదేళ్ళ బాండ్ల ఈల్డ్‌ మళ్ళీ 3 శాతం దాటడం విశేషం. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ పరుగులు పెడుతోంది. 108.88 వద్ద డాలర్‌ ఇండెక్స్‌ ట్రేడవుతోంది. క్రూడ్‌ స్వల్పంగా తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ 96 డాలర్లపైనే ఉంది. బులియన్‌ మార్కెట్‌లో పెద్ద మార్పులు లేవు. ఔన్స్‌ బంగారం ధర 1750 డాలర్ల దిగువకు వచ్చేసింది.