For Money

Business News

జీతాల్లో కోత పెట్టిన ఇన్ఫోసిస్‌!

తొలుత విప్రో, తరవాత టీసీఎస్‌.. ఇపుడు ఇన్ఫోసిస్‌ వంతు. జూన్‌తో ముగిసే త్రైమాసానికి ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్‌ పేలో కోత విధించినట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. తన ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపింది. సగటున వేరియబుల్‌ పేఔట్‌ 70 శాతం దాకా ఉంటుందని కంపెనీ పేర్కొంది. సాధారణం ఆగస్టు నెల జీతంతో పాటు వేరియబుల్‌ పే అందుతుంది. కాని ఈ త్రైమాసానికి తక్కువ జీతాలు వచ్చాయి. కంపెనీ మార్జిన్స్‌ కాపాడుకోవడానికే జీతం కట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయా విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారిని తీసుకునేందుకు అధిక జీతం ఇవ్వాల్సి వస్తోందని కంపెనీ అంటోంది. ఉద్యోగం మానేస్తున్న ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్నా.. కంపెనీ మార్జిన్స్‌ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 23.7 శాతం నుంచి 20.1 శాతానికి పడిపోయింది.