For Money

Business News

దమానీ చేతికి ఝున్‌ఝున్‌వాలా ట్రస్టు పగ్గాలు

తన ట్రస్ట్‌ చీఫ్‌గా డీమార్ట్‌ అధినేత, మరో ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాధాకృష్ణ దమానీకి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అప్పగించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మార్కెట్‌లో దమానీని తన గురువుగా రాకేష్‌ భావించేశారు. మన మార్కెట్లలో బిగ్‌బుల్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తన ఆస్తుల నిర్వహణకు సంబంధించిన వీలునామాను రాశారు. ఇప్పటి వరకు తన పెట్టుబడులు నిర్వహించే వారు, తనకు అత్యంత సన్నిహితులైన కల్పరాజ్‌ ధరమ్‌షి, అమల్‌ పారిఖ్‌లను ట్రస్ట్‌లో సభ్యులుగా నియమించినట్లు తెలుస్తోంది. ఝున్‌ఝున్‌వాలాకు వివిధ లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటి విలువ రూ.46,000 కోట్ల వరకు ఉంటుదని మార్కెట్‌ వర్గాల అంచనా. తన భార్యతో కలిసి నెలకొల్పిన రేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ కంపెనీకి అనేక కంపెనీల్లో వాటా ఉంది. ఈ ఆస్తులను తన భార్య రేఖ, ముగ్గురు పిల్లలకు రాసినట్లు తెలుస్తోంది. విల్లును జే సాగర్‌ అసోసియేట్స్‌ తయారు చేసినట్లు సమాచారం. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన రేఖకు ఈక్విటీ మార్కెట్‌ గురించి బాగా తెలుసని, ఆమె సోదరుడికి కూడా ఈ వ్యాపారం బాగా తెలుసని రాకేష్‌ సన్నిహితులు అంటున్నారు.