ఎన్ చంద్ర గుడ్‌బై
టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు.కొత్త టర్మ్‌కు ఎంపిక చేయాల్సిందిగా ఆయన టాటా సన్స్‌ను కోరడం లేదు. ఆయన పదవీకాలంలో 2027 ఫిబ్రవరిలో పూర్తి కానుంది. అప్పటి వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఆ తరవాత ఆయన ఆ పదవిలో కొనసాగబోనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. సన్నహితుల వద్ద తన నిర్ణయం గురించి చంద్రశేఖరన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ వార్త వచ్చిన తరవాత టాటా గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ముఖ్యంగా టీసీఎస్ నాలుగు శాతం వరకు క్షీణించింది. ఈనెల 18వ తేదీన టాటా సన్స్ ఏజీఎం జరుగనుంది. ఈ సందర్భంగా ఆయనను మళ్ళీ డైరెక్టర్‌గా నియమించే అవకాశం లేదదని తెలుస్తోంది. రతన్ టాటాకు సన్నహిత వ్యక్తిగా పేరొందిన విజయ్ సింగ్ ఇప్పటికే రాజీనామా చేశారు. చంద్రశేఖరన్‌ను మళ్ళీ డైరెక్టర్ నియమించడానికి నోయెల్ టాటా సుముఖంగా లేరని తెలుస్తోంది. టాటా గ్రూప్‌లో జరుగుతున్న పరిణామాల కారణంగా నిఫ్టిపై ఒత్తిడి వచ్చింది. 24,300 దిగువకు నిఫ్టి క్షీణించింది.
