MTAR బ్యాడ్ న్యూస్!
నాన్ స్టాప్ ర్యాలీతో మన మార్కెట్ డార్లింగ్‌గా రాణించిన హైదరాబాద్ కంపెనీ MTAR టెక్నాలజీస్‌కు గడ్డు రోజులు ప్రారంభమైనట్లు కన్పిస్తోంది. కంపెనీ అభివృద్ధి కన్నా… అమెరికా కంపెనీలో జరిగే బిజినెస్‌కు తీవ్రంగా స్పందిస్తున్న MTAR Technologiesలో ఇవాళ భారీ కరెక్షన్ వచ్చే అవకాశముంది. నిన్న రెండు శాతంపైగా క్షీణించిన ఈ షేర్లో ఇవాళ కరెక్షన్ రావొచ్చు. కంపెనీ అమెరికా సంస్థ బ్లూమ్ ఎనర్జి షేర్ రాత్రి 6 శాతం దాకా క్షీణించింది. న్యూమెక్సికోలో ఒరాకిల్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. డేటా సెంటర్‌ను BLUE OWL CAPITAL INC నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు బ్లూమ్ ఎనర్జి విద్యుత్ సరఫరా చేయనుంది. స్థానికల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. దీంతో 2028లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, లేదంటే నిధుల సరఫరా ఆపేస్తానని BLUE OWL CAPITAL INCకు ఒరాకిల్ నిన్న నోటీసు ఇచ్చింది. దీంతో రాత్రి ఈ కంపెనీల షేర్లన్నీ ఆరు శాతంపైగా పడ్డాయి. దీంతో బ్లూమ్ ఎనర్జితో ఒప్పందంలో ఉన్న MTAR షేర్ ఇవాళ 2.5 శాతం నష్టంతో రూ. 6870 వద్ద ట్రేడవుతోంది. ఉదయం ఈ షేర్ రూ. 6750ని తాకింది.
