For Money

Business News

Sai Parental మాస్టర్‌ ప్లాన్‌

కంపెనీని జెట్‌ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్ళేందుకు యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంతంగా విస్తరణలో భాగంగా ప్లాంట్‌ ఏర్పాటు చేయడం కంటే ఇప్పటికే అన్ని విధాలా అనుకూలమైన కంపెనీలో మెజారిటీ వాటా తీసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో మూడు ఎకరాల్లో విస్తరించి ఉండటంతో పాటు EU గుడ్ మాన్యుఫాక్చరింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న కంపెనీ Saicriti Pharmaలో 60 శాతం వాటా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి రూ. 83.83 కోట్లు వెచ్చించనున్నారు. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా సమీకరించిన నిధులతో ప్లాంట్‌ విస్తరణ చేయాలని నిర్ణయించారు. ఇదే నిధులను ఇపుడు టేకోవర్‌ కోసం వినియోగిస్తారు
ఆధునిక క్రిటికల్ కేర్ స్టెరైల్ ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యమున్న కంపెనీలో వాటా తీసుకోవడం మంచిదని కంపెనీ భావించింది. అలాగే సొంత ఆర్‌ అండ్‌డీని అభివృద్ధి చేయడం కంటే ఇప్పటికే ఈ రంగంలో పేరొందిన కంపెనీలో వాటా తీసుకోవాలని నిర్ణయించింది. Prathyak laboratoriesలోనూ 60% వాటాను రూ. 18 కోట్లతో కొనుగోలు చేయనుంది.
R&D లో ఇప్పటికే రాణిస్తున్న Prathyak Laboratories టేకోవర్‌తో
124 ప్రొడక్ట్స్ అభివృద్ధి చేయాలని తన ప్లాన్‌ను జెట్‌ స్పీడ్‌తో కంపెనీ అమలు చేయనుంది. తాజా నిర్ణయాలతో కంపెనీ ఫాస్ట్‌గా వృద్ధి చెందుతుందని భావిస్తున్న యాజమాన్యం. ఇక జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 182 కోట్ల ఆదాయంపై రూ. 7.92 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈపీఎస్‌ రూ. 1.79.

Leave a Reply