For Money

Business News

భారీగా పెరిగిన చార్జీలు

ఎయిర్‌టెక్‌ కంపెనీ చార్జీలను భారీగా పెంచింది. అలాగే పలు పాపులర్‌ ప్లాన్‌లను తొలగించింది. తాజా సమాచారం మేరకు ఇక నుంచి ఎయిర్‌టెల్‌లో కనీస ప్లాన్‌ చార్జి రూ. 349గా మారింది. ఇప్పటి వరకు ఉన్న రూ. 299 ప్లాన్‌ను రద్దు చేసింది. అలాగే రూ. 319, రూ. 579, రూ. 619, రూ. 649 ప్లాన్‌లను ఎయిర్‌టెల్‌ రద్దు చేసినట్లు తెలుస్తోంది. రూ. 579తో పాటు రూ. 649 ప్లాన్‌ల స్థానంలో ఏకంగా రూ. 838 ప్లాన్‌ను తీసుకు వచ్చింది. దీంతో మధ్య తరగతికి ఒక్కసారిగా షాక్‌ తగిలింది. త్వరలోనే జియో కూడా తన చార్జీలను ఇదే స్థాయిలో పెంచే అవకాశముంది. ఇక వొడాఫోన్‌ కూడా ఇదే స్థాయిలో చార్జీలను పెంచుతుందా లేదా ఒక మోస్తరు బాదుడుతో సరిపెడుతుందా అన్నది చూడాలి.

Leave a Reply