For Money

Business News

గూగుల్‌ వచ్చినా… ఎయిర్‌టెల్‌ షేర్‌ డల్‌

ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో 70 కోట్ల డాలర్లను ఎయిర్‌టెల్‌ కంపెనీలో 1.28 శాతం వాటా తీసుకునేందుకు వెచ్చించనుంది. అలాగే 30 కోట్ల డాలర్లను మున్ముందు వివిధ వాణిజ్య ఒప్పందాల కింద గూగుల్ ఇన్వెస్ట్‌ చేస్తుంది. రూ.734 ధరకు గూగుల్‌ ఎయిర్‌టెల్‌లో 7.1 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. అయితే కంపెనీ డీల్‌ పట్ల మార్కెట్‌లో పెద్ద ఉత్సాహం కన్పించలేదు. నిన్న రూ.707 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ గూగుల్‌ వార్త వచ్చిన వెంటనే రూ. 754కు పెరిగింది. అయితే గూగుల్‌కు కేటాయించిన షేర్ల విలువ దాదాపు మార్కెట్‌ ధరకు సమానంగా ఉండటంతో అనేక మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో ఈ షేర్‌ ధర రూ. 701లకు పడిపోయింది. ఇపుడు రూ. 715 వద్ద ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ తీసుకున్న వాటా చాలా తక్కువగా ఉండటం, వ్యాల్యూయేషన్‌లో మార్పు లేకపోవడంతో… అనలిస్టులు కూడా ఈ డీల్‌ గురించి పెద్ద అంచనాలు ఇవ్వడం లేదు.