For Money

Business News

ఆర్సెనల్‌పై ముకేష్‌ అంబానీ కన్ను!

ప్రీమియర్‌ లీడ్‌ క్లబ్‌ అయిన ఆర్సెనల్‌ ఫుట్‌బాల్ క్లబ్‌ను టేకోవర్‌ చేసేందుకు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ ఆసక్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2022-23 సీజన్‌లో ఈ క్లబ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతంలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ లేదా లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ని కొనాలని ఆసక్తితో ఉన్న ముకేష్‌ అంబానీ ఇపుడు ఆర్సెనల్‌పై ఆసక్తి చూపుతున్నటలు ద అథ్లెట్‌ స్పోర్ట్స్‌ పోర్టల్‌ వెల్లడించింది. ఈ క్లబ్‌కు ఆయన కుమారుడు ఆకాష్‌ అంబానీ పెద్ద ఫ్యాన్‌ అని పోర్ట్‌ పేర్కొంది. ఆర్సెనల్‌ ప్రస్తుతం ఆర్సెనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు చెందిన కేఎస్‌ఈ యూకే ఐఎన్‌సీ ఆధ్వర్యంలో ఉంది.