For Money

Business News

ఇప్పుడు పప్పూ ఎవరు? మహువా స్పీచ్ వైరల్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో మాట్లాడుతున్నారంటే… ఒక రకమైన వెబ్రేషన్‌ వచ్చేస్తుంది సభలో. ఆరంభం నుంచి చివరి వరకు నాన్‌ స్టాప్‌ అనర్గళంగా ఇంగ్లీషులో పంచ్‌లు.. ముసుగా లేకుండా డైరెక్ట్‌ అటాక్‌. ఫైర్‌ బ్రాండ్ స్పీచ్‌కు చిరునామాగా మారింది. ఇవాళ ఇపుడు ఈ దేశంలో పప్పూ ఎవరు అంటూ చేసిన ప్రసంగం దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఈ దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని… విపక్షం వాటిని భరించలేకపోతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని మహువా ఇవాళ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అంత గొప్పగా దూసుకుపోతున్నపుడు బడ్జెట్‌ కేటాయింపుల కంటే మరో రూ. 3 లక్షల కోట్లు ఈప్రభుత్వానికి ఎందుకు అని నిలదీశారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం విభాగం ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన డేటాను ప్రస్తావిస్తూ… కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపడేశారు మహుశా. అన్ని రంగాలు పడకేశాయని స్వయంగా ఎన్‌ఎస్‌ఓ చెప్పిన గణాంకాలను ప్రస్తావించారు.
“‘పప్పూ’ అనే పదాన్ని ఈ ప్రభుత్వం, అధికార పార్టీ సృష్టించాయని.. ఇతరులను కించపరచడానికి, అసమర్థిడిగా ముద్ర వేసేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారని అంటూ… కానీ, అసలు పప్పూ ఎవరో మాకు ఈ గణాంకాలు చెబుతున్నాయని అంటూ మోడీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. ”మన దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని మన మంత్రిగారు చెప్పారు. అద్భుతం. మరి ఈ ఏడాది గత పది నెలల్లోనే 1,83.741 మంది మన దేశ పౌరసత్వాన్ని ఎందుకు వొదిలేసుకున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పన్నెండున్నర లక్షల మంది తమ పౌరసత్వాన్ని వొదులకున్నారు. ఎందుకు? ఏ ఏడాదిలోనూ లేని విధంగా అత్యధికంగా ఈ ఏడాది పౌరసత్వాన్ని వొదులుకున్నారు.
హైనెట్‌వర్త్‌ ఉన్న భారతీయులు పోర్చుగీసు పౌరసత్వం కోసం అక్కడి ప్రభుత్వానికి పది లక్షల డాలర్లు ఇవ్వడానికి ఎందుకు సిద్ధ పడుతున్నారు. ఇది దేశంలో సరైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వాతావరణమా? పప్పూ ఎవరు? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కత్తి తమ నెత్తిన వేలాడుతుంటే ఎంత మంది వ్యాపార వేత్తలు, హై నెట్‌ వర్త్‌ వ్యక్తులు ఇక్కడ ఉంటారు?” అని మహువా మొయిత్రా నిలదీశారు.