For Money

Business News

ఆల్‌టైమ్‌ హై వద్ద బ్యాంక్ నిఫ్టి

ఇవాళ నిఫ్టి 18600పైన ముగిసింది. దీనికి ప్రధాన కారణం బ్యాంకు షేర్లు. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ అర శాతంపైగా పెరగడంతో నిఫ్టి 18608 పాయింట్ల వద్ద 110 పాయింట్ల లాభంతో నిఫ్టి ముగిసింది. ఇక బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ చరిత్ర సృష్టించింది. 43,946 పాయింట్ల వద్ద ముగిసి… ఆల్‌టైమ్‌ హై రికార్డును సాధించింది. ఒకదేశలో 44000 దగ్గరగా వెళ్ళి 43983ని కూడా తాకింది. బ్యాంక్‌ నిఫ్టి ప్రధాన షేర్లే గాక… మిడ్‌క్యాప్‌, స్మాల్ క్యాప్‌ షేర్లలో కూడా భారీ ర్యాలీ వచ్చింది. ఉదయం 18490 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉండటంతో … నిఫ్టి గ్రీన్‌లోనే కొనసాగింది. అయితే స్వల్పంగా తగ్గినట్లు అన్పించినా.. చివరి అర గంటకు ముందు ఒక్కసారిగా నిఫ్టిలో జంప్‌ వచ్చింది. 18,617 పాయింట్లను నిఫ్టి తాకింది. ఇవాళ నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి అర శాతంపైగా లాభంతో క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు రెడ్‌లోముగిశాయి. అవి కేవలం నామమాత్రమే. ఇవాళ బ్యాంక్‌తో పాటు బజాజ్‌ ట్విన్స్‌ కూడా భారీగా పెరిగాయి. అలాగే ఇటీవల బాగా క్షీణించిన ఐటీషేర్లకు కూడా ఇవాళ మద్దతు లభించింది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ఒక దశలో 3 శాతం దాకా పెరిగిన ఎల్‌ఐసీ 2.79 శాతం లాభంతో రూ.716 వద్ద ముగిసింది.