For Money

Business News

ఏపీలో రూ.10,480… తెలంగాణలో రూ.9,403

ఆంధ్రప్రదేశ్‌ రైతులు నెలకు రూ. 10,480 చొప్పున సంపాదిస్తుండగా,
తెలంగాణలోని రైతులు సగటున నెలకు రూ. 9,403 సంపాదిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా రైతుల సగటు ఆదాయం సుమారు రూ. 10,000గా నిర్ధారించారు. ఈ డేటాను ‘ అగ్రికల్చర్‌ హౌజ్‌ హోల్డ్స్ అండ్‌ ల్యాండ్‌ అండ్‌ లైవ్‌స్టాక్స్‌ హోల్డింగ్స్‌ ఆఫ్‌ రూరల్‌ హౌజ్‌హోల్డ్స్‌’ పేరుతో నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) సర్వే చేసింది. ఈ డేటా 2019 సంవత్సరానికి సంబంధించినది. రైతుల ఆదాయంపై చేసిన ఈ సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

నంబర్‌ వన్‌ ఎవరంటే…
మనదేశంలో వ్యవసాయం ద్వారా వచ్చే సగటు నెలవారీ ఆదాయంలో మేఘాలయ తొలిస్థానంలో నిలిచింది. పంజాబ్ రెండో స్థానంలో, హర్యానా మూడో స్థానంలో నిలిచాయి. మేఘాలయ రైతులు సగటున నెలకు రూ. 29,000 సంపాదిస్తుండగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు నెలకు వరుసగా రూ. 26,000, రూ. 22,000 ఆర్జిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. జార్ఖండ్, ఒడిశా ,పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైతులు తక్కువ మేర నెలవారీ ఆదాయాలు ఆర్జిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ మూడు రాష్ట్రాల రైతులు సగటున నెలకు వరుసగా రూ. 4,000, రూ. 5,000 , రూ. 6,000 కంటే తక్కువగా సంపాదిస్తున్నారని లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది.