For Money

Business News

పెరగనున్న మారుతీ కార్ల ధరలు

ఈ ఏడాది వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధరల పెరుగుదల వివిధ మోడల్స్ బట్టి మారుతుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా కంపెనీ కార్ల ధరలను రూ.34,000 వరకు పెంచింది. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, ఆటో పరిశ్రమ గత కొన్ని నెలలుగా కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి ధరల పెంపును ప్రకటించింది. కార్ల తయారీదారు తన ఎంపిక చేసిన మోడల్స్ బట్టి ధరల పెంపు ₹1,000 నుంచి ₹22,500 వరకు ఉంది.