For Money

Business News

మార్కెట్లన్నీ లాభాల్లో….

ఒమైక్రాన్‌ భయాలతో యూరప్‌ మార్కెట్లు భారీగా పతనం కాగా, ఈ భయాలను అమెరికా మార్కెట్లు పట్టించుకోవడం మానేశాయి. ఆరంభంలో ఒక మోస్తరు లాభాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్‌ కొన్ని నిమిషాల్లో భారీ లాభాల్లోకి వచ్చింది. నాస్‌డాక్‌ కేవలం అర శాతం లాభానికే పరిమితం కాగా, మిగిలిన ఎస్‌ అండ్ పీ 500, డౌజోన్స్ సూచీలు ఒకటన్నర శాతం దాకా పెరిగాయి. ఆరంభంలో నష్టాల్లో ఉన్న డాలర్‌ కూడా గ్రీన్‌లోకి వచ్చింది. ఆరంభంలో బ్రెంట్‌ క్రూడ్‌ 67 డాలర్లకు పడిపోగా.. ఇపుడు 70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్‌ సమావేశంలో షెడ్యూల్‌ ప్రకారం చమురు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించినా… అరువుపై ఆయిల్‌ అమ్మాలన్న ప్రతిపాదనను అమెరికా వాయిదా వేసింది. ఇంతకుమునుపు భారత్‌, చైనా వంటి కొన్ని దేశాలకు అరువుపై 5 కోట్ల బ్యారెళ్ళ చమురు అమ్మాలని అమెరికా ప్రతిపాదించింది. చమురు ఇపుడు సరఫరా చేస్తే… వడ్డీతో 2022 నుంచి 2024 మధ్యకాలంలో చెల్లింపులు చేయొచ్చు.అయితే ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించడంతో అమెరికా తన ప్రతిపాదనను వాయిదా వేసింది. దీంతో క్రూడ్‌ ధరలు మళ్ళీ పుంజుకున్నాయి.