For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15769ని తాకిన నిఫ్టి ఇపుడు 15839 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్ల లాభంతో నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టిలో మొత్తం 35 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టితో పాటు నిఫ్టి నెక్ట్స్‌ కూడా అర శాతం లాభంతో ఉంది. అయితే నిఫ్టి మిడ్‌ క్యాప్‌, నిఫ్టి బ్యాంక్‌ మాత్రం ఒక మోస్తరు లాభంతో ఉన్నాయి. ఆటో షేర్లు టాప్‌ గేర్‌లో ఉన్నాయి. డే ట్రేడింగ్‌తోపాటు పొజిషనల్‌ ట్రేడింగ్‌కు చాలా మంది అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎస్కార్ట్స్‌ షేర్‌ను చాలా మంది రెకమెండ్‌ చేస్తున్నారు. ఐటీ షేర్లు పరవాలేదు. రెడ్‌లో ఉన్న షేర్లలో నష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. జొమాటో ఇవాళ గ్రీన్‌లో రెండున్నర శాతం లాభంతో ఉంది. రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇవాళ్టి ఫేవరరేట్స్‌గా ఉన్నట్లు అనలిస్టులు అంటున్నారు. ఏయూ బ్యాంక్‌లో ఇంకా ఒత్తిడి కొనసాగుతోంది. ఈ షేర్‌ ఇపుడు రూ.593ని తాకింది. నిన్న బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 550గా పేర్కొన్నాయి. ఇక లాభాల్లో ఉన్న బ్యాంక్‌ షేర్లలో బంధన్‌ బ్యాంక్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. మొత్తానికి కొన్ని షేర్లను మినహాయిస్తే.. మార్కెట్‌లో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు.