For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి కానీ…

నిఫ్టి ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి పడినా కాస్సేపు వెయిట్‌ చేయమని సలహా ఇస్తున్నారు అనలిస్టులు. నిఫ్టి కాస్త పడేంత వరకు ఆగమని సలహా ఇస్తున్నారు. 15700 లేదా 15688 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. ఈ స్థాయికి చేరితే కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. నిఫ్టిలో మిడ్‌ సెషన్‌ తరవాత రికవరీ రావొచ్చని వస్తే…నిఫ్టి 15800ని దాటే అవకాశముందని అంటున్నారు. 15700 వద్ద పుట్‌ రైటింగ్‌ అధికంగా ఉన్నందున ఈ స్థాయిలో మద్దతు లభించవచ్చు. ఈస్థాయి దిగువకు వెళితే కొనేవారు 15688 లేదా 16624 వద్ద మద్దతు లభించవచ్చు.
నిఫ్టి లెవల్స్‌ ఇవాళ్టికి…

అప్‌ బ్రేకౌట్‌ – 15911
రెండో ప్రతిఘటన – 15882
తొలి ప్రతిఘటన – 15863
నిఫ్టికి కీలకం – 15783
తొలి మద్దతు – 15736
రెండో మద్దతు – 15717
డౌన్‌ బ్రేకౌట్‌ – 15688