For Money

Business News

18 శాతం పెరిగిన గుడ్డు ధర

దాణా ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో గుడ్డు, చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో గుడ్డు ధర రూ.6లకు తగ్గినట్లు కన్పించినా… ఇపుడు మార్కెట్‌లో రూ.7 దాటింది. గత వేసవిలో వడగాలుల కారణంగా కోడి పిల్లలు భారీ సంఖ్యలో చనిపోయాయని, అలాగే దాణా ధరలు భారీగా పెరిగినందున గుడ్లను గల్ఫ్‌ దేశాలకు ఎగుమతికి అనుమతి ఇవ్వాలని పౌల్ట్రీ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దాణా ధరలు ఆకాశాన్నంటినందున చికెన్‌ ధరలు కూడా మార్కెట్‌లో కిలోకు రూ. 20 నుంచి రూ. 25 పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కోళ్ళ దాణా, మెడికల్‌ ఖర్చలు 90 శాతం పెరిగాయని వెస్ట్‌ బెంగాల్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ కార్యాదర్శి మదన్‌ మోహన్‌ మైత్రి తెలిపారు. వీటికి తోడు రవాణా ఖర్చులు కూడా పెరిగాయని అంటున్నారు. గుడ్డు ధర రూ.7కి తగ్గితే తమకు నష్టాలు వస్తాయని మైత్రి అంటున్నారు.ధరలు పెరగడానికి ఏకైక కారణం…. దాణా ఖర్చు భారీగా పెరగడమేనని ఆయన తెలిపారు.