For Money

Business News

ఫార్ములా ఈ-ప్రిక్స్‌ రేస్.. డేట్‌ ఓకే

ఐటీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆర్జించిన హైదరాబాద్‌ ఇపుడు క్రీడల్లో కూడా రాణిస్తోంది. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
దేశంలో జరిగే మొదటి ‘ఈ-రేస్’కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. నెక్లస్ రోడ్డు మీదుగా పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఫార్ములా1 మాదిరిగా ‘ఈ–రేస్‌’కు ప్రత్యేక ట్రాక్‌ అవసరం ఉండదు. సాధారణ రోడ్లపైనే బ్యాటరీ కార్లతో రేసింగ్‌ నిర్వహిస్తారు.