For Money

Business News

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇవాళ నవాబ్‌ మాలిక్‌ను విచారణకు ఈడీ పిలిచింది. అయితే ఇవాళ ఉదయం 6 గంటలకే నవాబ్‌ మాలిక్‌ ఇంటికి వచ్చి ఆయనను ప్రశ్నించేందుకని తీసుకెళ్ళారు. ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌, అతని అనుచరుల కార్యకలాపాలతో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దావూద్‌ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌తో పాటు ఇతరులపై ఈడీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధం ఉన్నవారి నుంచి నవాబ్‌ మాలిక్‌ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఈడీకి దొరికాయని వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.