For Money

Business News

నిఫ్టి: లాభాలన్నీ పాయే…

ఉదయం నుంచి ఆటుపోట్లకు గురైన నిఫ్టి క్లోజింగ్‌లో లాభాలన్నీ కోల్పోయి… నష్టాల్లో ముగిసింది. యూరో మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నా… మన మార్కెట్‌ నష్టాల్లోకి జారుకుంది. దీనికి ప్రధాన కారణం రేపు వీక్లీ, మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటం ఒక కారణమని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఉదయం ఆరంభంలో 17220స్థాయిని తాకిన నిఫ్టి.. తరవాత హెచ్చుతగ్గులకు లోనైంది. మిడ్‌సెషన్‌లో కూడా ఒక మోస్తరు లాభాలతో ఉంది. అయితే సరిగ్గా స్క్వేర్‌ ఆఫ్‌కు ముందు ఒక్కసారిగా లాభాలు పొందినా… కొన్ని నిమిషాల్లోనే లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 17,027స్థాయికి చేరింది. తరవాత కొద్దిగా లాభపడింది 17,063 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 29 పాయింట్లు నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ ఒక్కటే ఆకర్షణ లాభంతో క్లోజ్‌ కాగా, ఇతర సూచీలు దాదాపు లాభాలన్నీ కోల్పోయింది. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా నామమాత్రపు లాభంతో ముగిసింది.