For Money

Business News

TS: తలసరి ఆదాయం రూ. 2,37,632

ప్రస్తుత ధరల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (GSDP) రూ. 9,80,407 కోట్లుకు చేరింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక అంచనాలతో నివేదిక విడుదల చేసింది.
ఇదే సమయంలో దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి (జీడీపీకి) అత్యధిక వాటా ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ఆరవ స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం 2020-21లో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ. 2,37,632. అదే స్థిర ధరల ప్రకారం రూ.1,53,298, వివిధ రంగాల్లో తెలంగాణ ప్రగతి విశ్లేషిస్తే… 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వృద్ధి రేటు 14.3 శాతం చొప్పున పెరిగిందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. జాతీయ స్థాయిలో ఈ రంగాల వృద్ధి రేటు 3.6 శాతం మాత్రమే.