For Money

Business News

థైరో కేర్‌ షేర్‌కు MACD అనుకూలం

మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్‌ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. వాటిల్లో థైరోకేర్‌ టెక్‌ ముందుంది. దీనికి ప్రధాన కారణం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు రావడమే. దీంతో వైద్య పరీక్షలకు డిమాండ్ పెరుగుతుందనే అంచనాతో ఇన్వెస్టర్లు ఈ షేర్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదానీ గ్యాస్‌, ఆర్బీఎల్ బ్యాంక్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ , జుబ్లియంట్ లైఫ్‌, ప్రొక్టర్‌ అండ్ గాంబుల్ హెల్త్‌ కౌంటర్లలో కూడా MACD అనుకూలంగా ఉంది. కొన్ని షేర్లలో బేరిష్‌ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… రామ్‌కో సిమెంట్స్‌, గుజరాత్ అంబుజా, కార్రొరాండమ్‌ యూనివర్సల్‌, గుజరాత్ గ్యాస్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్స్‌, అపోలోటైర్స్‌. ఈ షేర్లలో బేరిష్‌ ధోరణి ప్రారంభమైనట్లు కన్పిస్తోంది.
శుక్రవారం ట్రేడింగ్‌ చూస్తే… వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్, ఏథర్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ముందున్నాయి. అదే వాల్యూమ్‌ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే సుజ్లాన్‌ ఎనర్జి, జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, వొడాఫోన్‌ ఐడియా, జేపీ పవర్‌, రేణుకా సుగర్స్‌, ఎస్‌ బ్యాంక్‌ ముందున్నాయి.