For Money

Business News

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌కు MACD అనుకూలం

మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్‌ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. వాటిల్లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ముందుంది. ఇంకా హెచ్‌పీసీఎల్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, అదానీ గ్యాస్‌, థైరోకేర్‌ టెక్‌, పీ అండ్ జీ హెల్త్‌ కౌంటర్లలో కూడా MACD అనుకూలంగా ఉంది. కొన్ని షేర్లలో బేరిష్‌ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ బ్యాంక్‌ ముందుంది. ఇంకా ధని స్వీసెస్‌, హీరో మోటో కార్ప్‌, ప్రిన్స్‌ పైప్స్‌, వి మార్ట్‌ రీటైల్‌, జేకే లక్ష్మి సిమెంట్స్‌ ఉన్నాయి. ఈ షేర్లలో పతనం ప్రారంభమైనట్లు కన్పిస్తోంది.
నిన్నటి ట్రేడింగ్‌ చూస్తే… ఎన్‌ఎస్‌ఈలో వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ముందున్నాయి. అదే ఎన్‌ఎస్‌ఈలో వాల్యూమ్‌ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే వోడాఫోన్‌ ఐడియా, ఫ్యూచర్‌ రీటైల్‌, ఓఎన్‌జీసీ, సుజ్లాన్‌ ఎనర్జి, ఎంఆర్‌పీఎల్‌, జొమాటో ముందున్నాయి.