For Money

Business News

ఎల్‌ఐసీ షేర్‌ 7% జంప్‌…ఎందుకు?

ఇవాళ ఎల్‌ఐసీ షేర్‌ ఏకంగా ఎనిమిది శాతం దాకా పెరిగింది. చివర్లో స్వల్పంగా తగ్గి ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ 7.21 శాతం లాభంతో రూ. 738.20 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్‌ రూ. 49.65 పెరిగింది. ఇవాళ ఈ షేర్‌రూ. 741.75ని తాకింది. అంటే దాదాపు అధికస్థాయిలో ముగిసిందన్నమాట. ఇవాళ ఎల్‌ఐసీ షేర్‌లో భారీ జంప్‌కు కారణం.. ఐఆర్‌సీటీసీలో ఎల్‌ఐసీ మరింత అదనపు వాటా కొనుగోలు చేయడమే. గత కొన్ని రోజుల నుంచి ఐఆర్‌సీటీసీలో మరో 5 శాతాన్ని కేంద్రం అమ్ముతుందని వార్తలు వస్తున్నా… ఎవరో కొంటారో అన్న సస్పెన్స్‌ మాత్రం కొనసాగింది. ఇవాళ 1.81 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. ఐఆర్‌సీటీలో ఎల్‌ఐసీ వాటా 5.005 శాతం నుంచి 7.278 శాతానికి పెరిగింది. దీంతో ఎల్‌ఐసీ కొనుగోలు ధర సగటున రూ.692.28 అయింది. ఇవాళ ఐఆర్‌సీటీసి స్వల్ప లాభంతో రూ. 686.80 వద్ద ముగిసింది.