For Money

Business News

18400పైన ముగిసిన నిఫ్టి

ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టికి గట్టి మద్దతు లభించింది. మిడ్‌ సెషన్‌ వరకు పెరిగిన నిఫ్టి సరిగ్గా ఆ సమయంలో కాస్త ఒత్తిడికి లోనైంది. అయితే ఉదయం నుంచి చూపుతున్న ఫ్యూచర్స్‌కు భిన్నంగా యూరో మార్కెట్‌ లాభాలతో ప్రారంభం అయింది. దీంతో నిఫ్టికి మళ్ళీ మద్దతు లభించింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి దాదాపు 200 పాయింట్లు పెరిగింది. దుయం 18244ని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18431 పాయింట్ల స్థాయిని తాకింది. చివరికి 151 పాయింట్ల లాభంతో 18420 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 468 పాయింట్లు లాభపడింది. బ్యాంకుల కంటే ఫైనాన్షియల్స్‌ నుంచి నిఫ్టికి గట్టి మద్దతు లభించింది. నిఫ్టిలో అదానీ పోర్ట్స్‌ , అదానీ ఎంటర్‌ప్రైజస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి నెక్ట్స్‌లో ఎల్‌ఐసీ ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్‌ 7 శాతంపైగా లాభపడింది. అలాగే ఇండిగో నాలుగు శాతం దాకా లాభపడింది. ఇవాళ న్యూఏజ్‌ షేర్లలో ఒత్తిడి కన్పించింది. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా కోలుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన అశోక్‌ లేల్యాండ్‌ షేర్‌ రెండున్నర శాతంపైగా పెరిగింది. అరబిందో ఫార్మా ఇవాళ రూ. 450 దిగువకు వచ్చి రూ. 438 వద్ద ముగిసింది. నాట్కో ఫార్మా కూడా రూ. 550 దిగువన ముగిసింది.