For Money

Business News

ఎల్‌&టీ కూడా నిరుత్సాహమే

ప్రముఖ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ కూడా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ.3620 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ప్రకటించిన రూ. 3292 కోట్లతో పోలిస్తే 9.95 శాతం అధికమన్నమాట. అయితే మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం కంపెనీ రూ. 3788 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. నికర లాభం స్థాయిలోనే ఆదాయం కూడా 10 శాతం పెరిగి రూ. 52,851 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ అమ్మకాల వాటా 33 శాతం అంటే రూ. 17550 కోట్లు ఉందని కంపెనీ వెల్లడించింది. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ 12.34 శాతమని కంపెనీ తెలిపింది. నికర లాభ మార్జిన్‌ మాత్రం కేవలం 6.85 శాతం మాత్రమే. ఈ మూడు నెలల కాలంలో కంపెనీకి రూ. 73941 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయి. మధ్యప్రాచ్యం నుంచి ఓ మెగా ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ. 22 ఫైనల్‌ డివిడెండ్‌ను ప్రకటించింది.