For Money

Business News

KYC గడువు మళ్ళీ పొడిగింపు

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు కేవైసీ అప్‌డేట్ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వాస్తవానికి ఈ గడువు రేపటితో అంటే డిసెంబర్ 31 పూర్తి కానుంది. అయితే ఈ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. గడువు పెంచడం ఇది రెండోసారి. డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతా ఉన్నవారు తమ పేరు, చిరునామా, పాన్, మొబైల్ నంబర్, ఆదాయాలు, సరైన ఈమెయిల్ ఐడీని కేవైసీ కింద అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా షేర్లను కొనుగోలు లేదా అమ్మాలంటే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా తప్పనిసరి. ఈ రెండు ఖాతాలు ఇప్పటికే తెరచి ఉన్నా.. వాటికి KYC పూర్తి చేయనివారు ఉన్నారు. వారందరు ఇపుడు చేయాల్సి ఉంటుంది.