For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మండి

కొత్త ఏడాది కారణంగా మార్కెట్లు చాలా డల్‌గా ఉన్నాయి. ఇవాళ మన మార్కెట్లలో డిసెంబర్‌, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. నిఫ్టిలో ఇవాళ తీవ్ర హెచ్చతుగ్గులు ఉంటాయా అన్నది అనుమానమే. ఎందుకంటే ట్రేడింగ్‌ చాలా డల్‌గా ఉంది. అయితే అమెరికా ఇన్వెస్టర్ల అకౌంట్లు ఇవాళ్టి ముగుస్తారు కాబట్టి… ఇక్కడి పొజిషన్స్‌లో ఇవాళ మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. ఇక నిఫ్టి ఇవాళ్టి లెవల్స్‌ విషయానికి వస్తే… నిఫ్టి క్రితం ముగింపు 17,213. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి గ్రీన్‌లో ఓపెనైతే..తొలి నిరోధం 17,260, తరవాత 17,290 ప్రాంతంలో ఎదురు కావొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 17,290 స్టాప్‌లాస్‌తో 17,270 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిఫ్టి 17,225 ప్రాంతంలో స్థిరంగా ఉండే అవకాశముంది. ఇక వేళ పడితే నిఫ్టికి 17,166 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు. లేదంటే 17,140 ప్రాంతంలో మద్దతు అందే అవకాశముంది.17,150-17,250 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముంది. మరీ హెచ్చుతగ్గులుంటే… 17,100-17,270 మధ్య కదలాడే అవకాశముంది.