For Money

Business News

17150 దిగువకు నిఫ్టి

ఓపెనింగ్‌లోనే నిఫ్టిలో స్వల్ప అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభించిన వెంటనే 17,204ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 17,148ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 26 పాయింట్ల నష్టంతో ఇపుడు 17,187 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే అన్నీ నామ మాత్రపు నష్టాలే. షేర్ల వరకు చూస్తే … బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ముంఖ్యంగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో అమ్మకాల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఈ షేర్‌ 40 శాతం క్షీణించింది. ఈ ఒక్క నెలలోనే 25 శాతం తగ్గింది. కొన్ని ఫార్మా కౌంటర్లలో కూడా లాభాల స్వీకరణ కన్పిస్తోంది. మిడ్‌క్యాప్‌లో కూడా పెద్ద నష్టాలు లేవు. ఫార్మా, ఐటీ షేర్లకు మాత్రమే అంతో ఇంతో మద్దతు లభిస్తోంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌ ఇవాళ 3 శాతం దాకా తగ్గింది. అనేక బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ టార్గెట్‌ రూ.130గా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ షేర్‌ రూ.140 వద్ద ట్రేడవుతోంది.