For Money

Business News

తగ్గిన కిమ్స్‌ లాభం

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) ఏకీకృత ప్రాతిపదికన రూ.79.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.92.03 కోట్లతో పోలిస్తే 16 శాతం తగ్గింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.477.45 కోట్ల నుంచి రూ.500.84 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఇతర ఆదాయం మినహాయిస్తే కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.495.5 కోట్లు ఉంది. కంపెనీ చరిత్రలో ఇదే ఒక త్రైమాసిక అత్యధిక ఆదాయమని కిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీ భాస్కర రావు తెలిపారు. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ విలీనం 2022 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు చెప్పారు. కాగా కంపెనీ వద్ద నికర నగదు నిల్వలు రూ.196 కోట్ల మేరకు ఉన్నాయన్నారు.