For Money

Business News

125 సీసీతో జూపిటర్‌

టీవీఎస్‌ కంపెనీ పండుగ సీజన్‌కు కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. జూపిటర్‌ మోడల్‌ ఇప్పటి వరకు 110సీసీకే పరిమితంగా కాగా, కొత్త మోడల్‌ 125సీసీతో తెచ్చామని అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌లో రెండు హెల్మెట్లు పెట్టుకునేంత సీట్‌ స్పేస్‌ ఉండటం విశేషం. జూపిటర్‌ 125 సీసీ ధర రూ.73,400. సెమీ డిజిటల్‌ స్పీడోమీటర్‌ కూడా ఇందులో అమర్చారు. దీంట్లో యావరేజ్‌ మైలేజీతో పాటు రియల్‌టైమ్‌ మైలేజీని కూడా చెక్‌ చేసుకోవచ్చు. ముందువైపే పెట్రోల్‌ నింపే సదుపాయముంది. ప్రస్తుతం 125 సీసీ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా, సుజుకీ యాక్సెస్‌ ఉన్నాయి. వీటికి పోటీగా జూపిటర్‌ వచ్చింది.