For Money

Business News

జుబిలెంట్‌ ఫుడ్‌… ఫలితాలు ఓకే

సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఉన్నాయి. కంపెనీ నికర లాభం అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 73శాతం వృద్ధితో రూ.119.82 కోట్లకు చేరాయి. కంపెనీ ఆదాయం కూడా 25శాతం వృద్ధితో రూ.1,116.19 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వ్యయాలు రూ.963.47 కోట్లకు పెరిగాయి. ఎబిటా 14శాతం పెరిగింది. మరోవైపు ఆర్థిక ఫలితాలు అంచనాలను మించినా కంపెనీ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. నిన్న ఒకదశలో రూ.3898 పడిపోయిన ఈ స్టాక్‌ స్వల్పంగా కోలుకుని రూ. 3953 వద్ద ముగిసింది. ఈ షేర్‌ నిన్న 9 శాతం అంటే రూ.378 నష్టపోయింది.