For Money

Business News

ఎస్‌బీఐ టార్గెట్‌ రూ.700

మాంద్యం నేపథ్యంలో మార్కెట్‌ విశ్లేషుకులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన రంగం బ్యాంకింగ్‌. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచే చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు కూడా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లను రెమెండేషన్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సేవల ఆధారంగా వ్యాపారం చేసే పలు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బ్యాంకింగ్‌తో పాటు మీడియా రంగానికి చెందిన షేర్లను రెకమెండ్‌ చేశారు. తాజా జెఫెరీస్‌ బ్రోకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా సిఫారసు చేసింది. బ్యాంక్‌ లాభదాయకత 3 నంచి 5 శాతం దాకా పెరిగే అవకాశముందని జెఫరీస్‌ అంటోంది. అలాగే రుణాల వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉందని, రుణాలకు డిమాండ్‌ పెరిగే కొద్దీ ఎస్‌బీఐ వాటా పెరుగుతుందని పేర్కొంది. కార్పొరేట్‌ రుణాలు పెరిగే పక్షంలో దాని ప్రభావం నికర వడ్డీ ఆదాయం కూడా ఉంటుందని వెల్లడించింది. రుణాల వృద్ధి రేటు ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు నిధుల సమీకరణ వ్యయం తక్కువగా ఉండటం వల్ల ఎస్‌బీఐ లాభం పెరిగే అవకాశముందని పేర్కొంది. జెఫరీస్‌ టార్గెట్‌ రూ.700. ఈ షేర్‌ నిన్న ఎన్‌ఎస్‌ఈలో రూ.573.60 వద్ద ముగిసింది.