For Money

Business News

స్టాక్‌ మార్కెట్‌లో రక్తపాతం

అద్భుత ఫలితాలు ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకంగా 4 శాతం నష్టంతో ముగిసిందంటే మార్కెట్‌ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సిప్లా ఒక్కటే రెండు శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఓఎన్‌జీసీ కేవలం 0.4 శాతం లాభంతో ముగిసింది. మిగిలినవన్నీ నష్టాల్లోనే… భారీ నష్టాల్లోనే. మెటల్స్‌ షేర్లు ఇవాళ ఐస్‌ ముక్కలా కరిగిపోయాయి. అన్ని రంగాల్లోనూ అత్యధికంగా ఈ షేర్ల సూచీ ఏకంగా ఏడు శాతం క్షీణించాయి. ఒకదశలో 17000 స్థాయిని కోల్పోయి 16997 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి చివర్లలో షార్ట్‌ కవరింగ్‌ కారణంగా నిఫ్టి 150 పాయింట్లు కోలుకుంది. వెరశి 468 పాయింట్లు అంటే 2.66 శాతం నష్టంతో ముగిసింది. కాని ఇవాళ భారీ క్షీణించింది మాత్రం నిఫ్టి నెక్ట్స్‌, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి. ఈ రెండు సూచీలు దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. నిఫ్టి నెక్ట్స్‌లో 47 షేర్లు, మిడ్‌ క్యాప్‌లో మొత్తం 50 షేర్లు నష్టోయాయి. ఇక బ్యాంక్‌ నిఫ్టి 1.67 శాతం, నిఫ్టి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.29 శాతం నష్టపోయాయి. బ్యాంకుల్లో కేవలం ఒక బంధన్‌ బ్యాంక్‌ మినహా… మిగిలిన బ్యాంకులన్నీ నష్టాల్లో ముగిశాయి.