For Money

Business News

నిఫ్టి నష్టాల్లో… ఐఆర్‌సీటీసీ లాభాల్లో

ఒకవైపు నిఫ్టి నష్టాల్లో ట్రేడవుతున్నా IRCTC షేర్లు దూసుకుపోతున్నాయి. షేర్‌ విభజిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ కౌంటర్‌లో ర్యాలీ కన్పిస్తోంది. కేవలం నెల రోజుల్లోనే ఈ షేరు 50 శాతం పైగా పెరిగింది. ఇవాళ ఉదయం IRCTC షేర్లు 8 శాతానిపైగా పెరిగి రూ.4510ని తాకాయి. ఇది ఈ కౌంటర్‌లో ఆల్‌టైమ్‌ హై. ఉదయం లాభాల్లో ఉన్న నిఫ్టి ఇపుడు నష్టాల్లోకి వచ్చింది. కాని ఈ షేర్‌ మాత్రం ఇపుడు కూడా 7 శాతం లాభంతో రూ. 4,447 వద్ద ట్రేడవుతోంది.ఒక్కో షేర్‌ను అయిదు షేర్లుగా విభజించాలని కంపెనీ నిర్ణయించిన విషయం తెలిసిందే. షేర్ల విభజనకు రికార్డ్‌ డేట్‌ ఈ నెల 29. స్టాక్ స్పిట్ తరవాత ఈ కౌంటర్‌లో లిక్విడిటీ పెరగనుంది. రైళ్లలో కేటరింగ్‌తో పాటు, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్డ్ బిజినెస్, ఆన్ లైన్ టికెటింగ్ వ్యాపారం చేస్తున్న ఐఆర్‌సిటిసి ఇష్యూ ధర కేవలం రూ.320 మాత్రమే. 2019 అక్టోబర్‌లో ఈ సంస్థ మార్కెట్లలో లిస్ట్ అయింది.