For Money

Business News

ఈ ఏడాదీ సాధారణ వర్షపాతం

వరుసగా నాలుగోసారి కూడా మనదేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. లాంగ్ టర్మ్‌ యావరేజ్‌కు 103 శాతం మేర వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ముత్యంజయ మహాపాత్రి ఆన్‌లైన్‌లో జరిపిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జూన్‌లో నైతురు రుతుపవనాలతో ప్రారంభమయ్యే వర్షాల సీజన్‌ నాలుగు నెలల పాటు ఉంటుంది. ఈ నెలల్లో గత 50 ఏళ్ళలో సగటున కురిసిన వర్షం పాత 87 సెంటీ మీటర్లు (35 ఇంచీలు) ఈ ఏడాది కూడా దీనిలో 96 శాతం లేదా 104 శాతం మధ్య ఉంటుందని IMD అంచనా వేసింది. లా నినా వాతావరణ పరిస్థితులు ఈ రుతుపవనాల సమయంలో ఉంటుందన్నారు.