For Money

Business News

నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చినా…

ఉదయం 16521 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా నష్టాలను పూడ్చుకుని మిడ్‌సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. 16670ని తాకింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. ఉదయం నష్టాల్లో ఉన్న అనేక షేర్లు మిడ్‌ సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చాయి. మెటల్‌ షేర్లకు మళ్ళీ ఊపు వచ్చేలా ఉంది. కొన్ని నిఫ్టి షేర్లలో ఒత్తిడి వస్తోంది. నిఫ్టి, నిఫ్టి బ్యాంక్‌ నష్టాల్లో ఉన్నా… నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు అర శాతం లాభంతో ఉన్నాయి. ప్రస్తుతం నిఫ్టి 39 పాయింట్ల నష్టంతో 16,623 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకునేసరికి అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక శాతం దాకా నష్టాల్లో ఉంది. డౌజోన్స్‌ పరిస్థితి అలానే ఉంది. దీంతో నిఫ్టి ప్రస్తుత స్వల్ప నష్టాలతో ముగుస్తుందా లేదా భారీ నష్టాల్లో ముగుస్తుందా అన్నది చూడాలి.