For Money

Business News

16,600 దిగువన ముగిసిన నిఫ్టి

బ్యాంకు షేర్లు ఇవాళ నిఫ్టికి హ్యాండిచ్చాయి. దీంతో నిఫ్టి నష్టాలతో ముగిసింది. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైనా… మిడ్‌ సెషన్‌కల్లా లాభాల్లోకి వచ్చింది నిఫ్టి. 16,690 పాయింట్లను తాకిన తరవాత దాదాపు వంద పాయింట్లు నష్టపోయింది. క్లోజింగ్‌కు స్వల్పంగా పెరిగినా… 16,584 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 77 పాయింట్లు నష్టపోయింది. దీనికి ప్రధాన కారణంగా నిఫ్టి బ్యాంక్‌ నష్టాల్లో ముగియడం. నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ 0.95 శాతం తగ్గింది. మిగిలిన సూచీలు లాభాల్లో ఉన్నా.. నామమాత్రపు లాభాలే. ఓఎన్‌పీసీ, ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ నష్టాల్లో ముందున్నాయి. సన్‌ ఫార్మా కూడా మూడు శాతం దాకా నష్టపోయింది. నౌకరీ, జొమాటొ, నైకా క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జొమాటొ రూ. 58 నుంచి రూ. 76కు వచ్చేసింది. అదానీ షేర్లు డల్‌గా ఉన్నాయి.