For Money

Business News

జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతం

గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో దేశీ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 8.7 శాతంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.1 శాతమని తెలిపింది. అంత క్రితం ఆర్థిక సంవత్సంర అంటే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 6.6 శాతం. అలాగే జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) 2021-22లో 8.1 శాతం. 2020-21లో ఇది మైనస్‌ 4.8 శాతంగా నమోదైంది.
కీలక రంగాలు జంప్‌
మార్చి నెలలో ఎనిమిది కీలక రంగాలు 4.9 శాతం చొప్పున వృద్ధి చెందగా, ఏప్రిల్‌ నెలలో ఇదే రంగాలు 8.4 శాతం చొప్పున అభివృద్ధి చెందాయి. తాజా గణాంకాల ప్రకారంర 2021-22లో దేశ ద్రవ్యలోటు జీడీపీలో 6.71 శాతంగా కేంద్రం పేర్కొంది. వాస్తవానికి ద్రవ్యలోటు 6.9 శాతం ఉంటుందని అంచనా వేశారు.