For Money

Business News

20 శాతం జంప్‌… ఎందుకంటే..

ఐపీఎఫ్‌సీ.. ఈ షేర్‌ లేని చిన్న ఇన్వెస్టర్లు లేరు. ప్రతి ఒక్కరినీ ఊరించి.. ఊరించి విసిగించిన షేర్‌ ఇది. తక్కువ ధర ఉండటం, ప్రభుత్వ రంగ కంపెనీ కావడంతో పాటు ఈ కంపెనీ ఆధీనంలో వేల ఎకరాలు ఉండటంతో… ఎప్పటికైనా ఈ షేర్‌ పెరగకపోతుందా… అనే విశ్వాసంతో చాలా మంది ఈ షేర్లను ఉంచుకున్నారు. వీరికి ఇవాళ శుభవార్తే. ఈ వార్త వచ్చిన వెంటనే షేర్‌ 20 శాతం పెరిగి రూ. 12ని తాకింది. ప్రస్తుతం 15 శాతం లాభంతో రూ. 11.50 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీకి సంబంధించిన ఓ వార్తను బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ రాసింది. ఈ కంపెనీలో ప్రభుత్వం రూ.2000 కోట్ల మూలధనం ఇవ్వనుంది. ఐఎఫ్‌సీఐకి ఓ అనుబంధ సంస్థ ఉంది. దాని పేరు స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా. స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీలోకి ఐఎఫ్‌సీఐని విలీనం చేయనుందని ఈ వార్తా సంస్థ పేర్కొంది. గత నాలుగేళ్ళుగా ఐఎఫ్‌సీఐ నష్టాలను చూపుతోంది. షేర్‌ కూడా 17 శాతంపైగా క్షీణించింది. తాజా వార్తతో ఈ కౌంటర్‌లో కాస్త జోష్‌ వచ్చింది.