For Money

Business News

ఐసీఐసీఐ బ్యాంక్‌ పనితీరు భేష్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను మించింది. బ్యాంక్‌ నికర లాభం రూ. 5,511 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంతో నమోదైన రూ. 4,251 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికంగా. ఇదే సమయంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం కూడా 25 శాతం పెరిగి రూ. 9,366 కోట్ల నుంచి రూ. 11,689 కోట్లకు చేరింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే … సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు రూ. 43,148 కోట్ల నుంచి రూ. 41,437 కోట్లకు తగ్గింది. నికర ఎన్‌పీఏలు 9,305 కోట్ల నుంచి రూ. 8,161 కోట్లకు తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంకు రుణాలు 17 శాతం పెరిగి రూ. 7.64 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌ నెలాఖరున బ్యాంకుకు 5,277 శాఖలు, 14,045 ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకు వద్ద మొత్తం డిపాజిట్లు 17 శాతం పెరిగి రూ. 9.77 లక్షల కోట్లకు చేరాయి.