For Money

Business News

ప్రపంచపు తొలి ట్రిలియనీర్‌!

ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్‌ అయ్యే అవకాశముందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. టెస్లా కార్లతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎలాన్‌ మాస్క్‌కు తాజా సంపద టెస్లా నుంచి రాదని… ఆయన 2002లో ప్రారంభించిన స్పేస్‌ ఎక్స్‌ నుంచి వస్తుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. 2020లో అమెరికాలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ విలువ దాదాపు 85,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఎలాన్‌కు 20 శాతంపైగా వాటా ఉంది. స్పేస్‌ విలువ ఇపుడు కేవలం 3000 కోట్ల డాలర్లు మాత్రమే. అంటే స్పేస్‌ ఎక్స్‌ కన్నా టెస్లా 30 రెట్లు అధికమన్నమాట. అయితే మున్ముందు స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఎలాన్‌ మాస్క్‌కు భారీ ఆదాయం వస్తుందని, కంపెనీ వ్యాల్యూయేషన్‌ భారీగా పెరగనుందని మోర్గాన్‌ స్టాన్లీ అంటోంది.