For Money

Business News

రూ. 2వేలకే విమాన టికెట్‌…కానీ

ఇండిగో విమాన సంస్థ హాలిడే సేల్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ 25వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుంది. ఇపుడు టికెట్లు బుక్‌ చేసుకున్నవారు 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 14 మధ్య ప్రయాణానికి ఈ టికెట్లను వాడాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణానికి టికెట్‌ ధర రూ.2,023 నుంచి ప్రారంభం అవుతుందని.. ఇందులో అన్ని రకాల చార్జీలు కలిపి ఉంటాయని ఇండిగో పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్‌ ధర రూ.4999 నుంచి ప్రారంభమౌతుందని తెలిపింది. అయితే ఎయిర్‌ పోర్ట్‌ చార్జీలు, ప్రభుత్వ ట్యాక్స్‌లు ఇందులో ఉండవు. అంటే ఈ ధరకు అదనం అన్నమాట. ఇది కేవలం నాన్‌ స్టాప్‌ ఫ్లయిట్లకే వర్తిస్తాయి. కంపెనీ ప్రకటించే ఇతర ఆఫర్‌లతో దీనికి సంబంధం లేదు. రెండింటిని కలపడానికి వీల్లేదు. అయితే హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్లకు అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది… అయితే గరిష్ఠంగా రూ. 750 మాత్రమే ఇస్తారు. ఫైనల్‌గా… పరిమిత సంఖ్యలో ఈ సీట్లను ఆఫర్‌ చేస్తున్నారు. సీట్లు ఉన్నంత వరకే ఈ ఆఫర్‌ ఉంటుంది.