For Money

Business News

ఆ దేశాల నుంచి వస్తే… కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ మస్ట్‌!

కోవిడ్‌ కేసులు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ నెగిటివ్‌ సరిఫ్టికెట్‌ తప్పనిసరి చేయునుంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలో అనేక దేశాల్లో కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలాంటి దేశాల నుంచి వచ్చేవారు తనకు కోవిడ్‌ లేదని అంటే కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే అనుమతిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్‌ మాండవియా అన్నారు. న్యూస్‌ఎక్స్‌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లోగా సదరు దేశాల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. ఆ దేశాల నుంచి వచ్చేవారు ముందుగా ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ సర్టిఫికెట్‌ అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుందని… ఆ తరవాతే రానిస్తామని ఆయన చెప్పారు. ప్రయాణీకులు భారత్‌కు వచ్చే ముందు సదరు సర్టిఫికెట్‌ను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని… భారత్‌కు వచ్చిన తరవాత కూడా థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుందని మంత్రి అన్నారు. ఇపుడున్న వస్తున్న ప్యాసింజర్లలో 2 శాతం మందిని టెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు.