For Money

Business News

చందా కొచ్చర్‌ దంపతుల అరెస్ట్‌

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌కొచ్చర్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, మోసం, అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. 2018లో పలు ఆరోపణలుఉ రావడంత ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా చందా కొచ్చర్‌ రాజీనామా చేశారు. 2012లో బ్యాంకు సీఈవో హోదాలో వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన కంపెనీలకు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసిన కొన్ని నెలల్లోనే చందాకొచ్చర్‌ కుటుంబ సభ్యులకు చెందిన నుపుర్‌లో వీడియోకాన్ గ్రూప్‌ భారీ పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్తను అరెస్టు చేసింది.2020 సెప్టెంబర్‌లో మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద దీపక్‌ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు.