For Money

Business News

ఎన్‌డీటీవీకి ప్రణయ్‌ బైబై

న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా ఉంది. ఇందులో అయిదు శాతం వాటా కొనసాగిస్తామని… మిగిలిన 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు రూ. 647.6 కోట్ల విక్రయిస్తున్నట్లు వీరు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపారు. డిసెంబర్‌ 30వ తేదీన లేదా ఆ తరవాత ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తమ వాటాను విక్రయిస్తున్నట్లు ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. గడచిన 60 ట్రేడింగ్‌ రోజుల్లో కంపెనీ షేర్‌ సగటు ధరకు తమ వాటాను విక్రయిస్తున్నట్లు తెలిపారు. సగటు ధర రూ. 368.43గా తేలడంతో… ఇదే ధరకు ప్రణయ్‌ దంపతులు తమ 1.75 కోట్ల షేర్లను అదానీలకు అమ్ముతున్నారు. అంటే రూ. 647.6 కోట్లు వస్తాయన్నమాట. ప్రణయ్‌ దంపతుల నుంచి వాటా కొనుగోలు తరవాత ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌ వాటా 69.71 శాతానికి చేరుతుంది.