For Money

Business News

నిఫ్టి…ఐటీ తప్ప… అన్నింటా అమ్మకాలే!

వడ్డీ రేట్ల సెగ స్టాక్‌ మార్కెట్‌కు గట్టిగా తగులుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. ఉదయం ఆసియా మార్కెట్లు 1.5 శాతంపైగా నష్టపోయాయి. ఆ తరవాత ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. దీంతో ఉదయం నుంచి మార్కెట్‌కు ఎటువైపు నుంచీ మద్దతు అందలేదు. ఆరంభంలో 17298ని తాకిన నిఫ్టికి అదే గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి మొదలై పతనం చివరి దాకా ఆగలేదు. మిడ్‌ సెషన్‌లో స్వల్పంగా పెరిగే ప్రయత్నం చేసినా ఎంతో సేపు ఆగలేదు. మళ్ళీ క్షీణించి 16,966ని తాకింది. కొద్దిగా కోలుకుని 16,985 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 263 పాయింట్లు క్షీణించింది. ఒక్క ఐటీ షేర్లకే గట్టి మద్దతు లభించింది. అది క్రమంగా తగ్గుతూ పోయింది. బ్యాంక్ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి 2.5 శాతం నష్టపోయింది. మిడ్‌ క్యాప్‌ అంతకన్నా అధికంగా 2.6 శాతం క్షీణించింది. భెల్ ఇవాళ 7 శాతంపైగా నష్టపోయింది.