For Money

Business News

గోల్డ్‌ గోవిందా…

స్పాట్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ గోల్డ్ నిన్న 52 వేల దిగువకు వచ్చింది. న్యూఢిల్లీలో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 760 తగ్గిన తులం ధర తగ్గి రూ. రూ.51,300 వద్ద ముగిసింది. ఆర్నమెంట్‌ బంగారం నిన్న స్పాట్‌ మార్కెట్‌లో రూ.500 తగ్గి రూ.47,600 వద్ద నిలిచింది. రాత్రి నష్టాలను పరిగణనలోకి తీసుకుంది ఇవాళ మరింత తగ్గే అవకాశముంది. అలాగే కిలో వెండి రూ.1,270 తగ్గి రూ.56,930కి చేరింది.అయితే రాత్రి ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బంగార మరింత క్షీణించింది. పైగా డాలర్‌ భారీగా పెరగడంతో మన మార్కెట్లలో పతనం అధికంగా ఉంది. రాత్రి అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్‌ బంగారం 1734 డాలర్లకు క్షీణించింది. దీంతో ఎంసీఎక్స్‌లో రాత్రి స్టాండర్డ్‌ బంగారం ఒక శాతంపైగా పడింది. పది గ్రాముల బంగారం ఆగస్టు నెల కాంట్రాక్ట్‌ రూ. 802 మేర తగ్గి రూ. 50500 వద్ద ముగిసింది. అంతకుముందు 50,450ని కూడా తాకింది. అయితే వెండి మాత్రం నిలకడగా ఉంది. రాత్రి రూ.115 తగ్గి రూ. 56750కి చేరింది.

(photo courtesy: krishnajewellers)